Monday, 13 August 2012

అమ్మలార నాన్నలార


అమ్మలార నాన్నలార ఎక్కడ మీ స్థానం ఏమిటి మీ గమ్యం
 
బ్రతికినన్ని నాళ్ళంతా రెక్కలు ముక్కలు చేసి 
మీ కండలు పిండి చేసి  మీ రక్తం ధారపోసి
ఇదిగోరా పాల బువ్వ అదిగోరా వెన్న బువ్వ
అని నోటికి అందిస్తే అపురూపం గా చూస్తే
మీ రెక్కలు తెగిన నాడు మీ డొక్కలు మాడునాడు
ఆదరించి అనునయించి ఆకలి తీర్చేవారు 
నేనున్నా మీకంటూ ధైర్యం చెప్పేవారు వున్నారా ఎవరైనా
వచ్చారా వచ్చారా ఒకరైనా
పెద్ద పెద్ద భవనాలలో ఆవాసం మీరిస్తే మారు మూల గుడిసెల్లో
మీ వాసం వారిస్తే పిడికిలంత గుండె పగిలి
ముక్కలు చెక్కలుగ మారి
రాబోయే చావు కొరకు రాణి సొంతవారి కొరకు
ఎదురు చూసి ఎదురు చూసి 
నేల రాలిపోయేరా
దూళిలోన కలిసేరా

No comments:

Post a Comment